Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమాణిక దాడి.. 40 మంది మృతి

by vinod kumar |
Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమాణిక దాడి.. 40 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా బెకా లోయలోని బాల్‌బెక్ నగరం(Balbek city)పై వైమాణిక దాడులకు పాల్పడింది. ఓ అపార్ట్ మెంట్ లక్ష్యంగా అటాక్ చేయగా.. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డట్టు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో ఆరుగురు వైద్యులు ఉన్నట్టు పేర్కొంది. ఈ దాడిలో భవనం మొత్తం ధ్వంసమైందని శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారని వెల్లడించింది. హిజ్బుల్లా (Hezbollah) మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Idf) దళాలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు. మరోవైపు బెన్ గురియన్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించినట్టు హిజ్బుల్లా తెలిపింది.

దాడులు ఆపితే చర్చలకు సిద్ధం: నయీమ్ ఖస్సెమ్

ఇజ్రాయెల్ తన దాడులను ఆపితే పరోక్షంగా చర్చలు జరపడానికి మార్గం సుగమం అవుతుందని హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ ఖస్సెమ్ (Naim Qassem) తెలిపారు. రాజకీయ చర్యలు శత్రుత్వాలకు ముగింపు పలకబోవని తాము నమ్మడం లేదన్నారు. నిరంతరం దాడులు ఆపినప్పుడే చర్చలు జరిగే చాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే లెబనాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంపునకు అభినందనలు తెలిపారు. కాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 3000 మందికి పైగా మరణించారు.

Advertisement

Next Story