IT Raids: గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు

by Shiva |
IT Raids: గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భీమవరం (Bheemavaram) వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ (Grandhi Srinivas) ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారుల (Income Tax Officials) సోదాలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధ్వర్యంలో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయా కార్యాలయాలు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు (Income Tax Officials) జల్లెడ పడుతున్నారు. అయితే, గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) తన వ్యాపారంలో భాగంగా ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.వేల కోట్ల పన్ను ఎగవేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూముల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారంటూ పలువురు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐటీ అధికారులు రంగంలోకి దిగి గ్రంధి శ్రీనివాస్ ఇంటితో పాటు ఆయన కార్యాలయాలు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed