Court: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు.. ఏం శిక్ష విధించారో తెలుసా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-07 04:28:52.0  )
Court: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో వినూత్న తీర్పు.. ఏం శిక్ష విధించారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు(Drunk and Drive Cases)ల్లో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు(Mancherial Court) తీర్పునిచ్చింది. మరోవైపు.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత చెప్పినా మద్యం ప్రియులు వినిపించుకోరు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, జైలుకు పంపిస్తామని హెచ్చరించినా కొందరిలో ఏమాత్రం మార్పు రావట్లేదు. ఈ నేపథ్యంలో కోర్టు వారికి బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పింది.

Advertisement

Next Story