Samantha: శోభిత ధూళిపాళకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.. సమంత షాకింగ్ పోస్ట్

by Hamsa |
Samantha: శోభిత ధూళిపాళకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.. సమంత షాకింగ్  పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పెద్ద కుమారుడు నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను నాగ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో అసలు వీరి మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైందని అంతా ఖంగుతిన్నారు. గత కొద్ది కాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేసిన చైతు, శోభిత(Shobhita Dhulipala) త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారు.

ఇప్పటికే పెళ్లి పనులు(marriage works) కూడా స్టార్ట్ అయినట్లు ఇటీవల శోభిత పసుపు కొట్టే ఫొటోలు షేర్ చేసింది. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించింది. కానీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత చెల్లెలు డాక్టర్. సమంత (Dr. Samantha)ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ది కౌంట్‌డౌన్ బిగిన్స్’’ అనే క్యాప్షన్ జత చేసి అక్క శోభిత, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.

ఇక ఈ పిక్స్‌లో అక్కినేని ఇంటికి కాబోయే కోడలు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ, పెళ్లి కూతురు బొమ్మను చూస్తూ కనిపించింది. ప్రజెంట్ సమంత(Dr. Samantha) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన అక్కినేని(Akkineni) అభిమానులు పెళ్లి డేట్(Marriage Date) అనౌన్స్ చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం కంగ్రాట్స్ చెబుతూ శోభిత(Shobhita Dhulipala) అందాన్ని పొగుడుతున్నారు.

Advertisement

Next Story