- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్ధాంతరంగా ఆగిపోయిన మోడ్రన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం
దిశ, పెద్దపల్లి టౌన్: పెద్దపల్లి పట్టణంలో పట్టణ ప్రజలందరికీ సౌకర్యవంతంగా విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. పట్టణ నడిబొడ్డున మార్కెట్ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం 65 ద్వారా 2.75 కోట్ల రూపాయల వ్యయంతో రెండు సంవత్సరాల క్రితం 2022 నవంబర్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభమైన మొదట్లో వేగంగానే పనులు నడిచిన తరువాత అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయి పిచ్చి చెట్లతో దర్శనమిస్తున్నాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను తీసుకురావాలని ఉద్దేశంతో సిద్దిపేట మాడ్రన్ మార్కెట్ ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆరంభ శురత్వంగానే ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పనులు జాప్యం జరగడంతో అప్పటికే మళ్లీ ఎలక్షన్లు రావడం నాయకులెవరూ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా
సగం పనులు జరిగిన ఆ భవన నిర్మాణాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఆ గదుల్లో మద్యం సేవించడం, చివరికి మల మూత్ర విసర్జనలకు వాటిని వాడుతుండడం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతుంది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు కూడా దీనిపై ఇంకా దృష్టి పెట్టలేదు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మిస్తున్న భవనాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది. ప్రస్తుతం వెజిటేబుల్ మార్కెట్ జెండా చౌరస్తాలో ఉండగా అది అత్యంత ఇరుకుగా మారింది. పెరుగుతున్న జనాభా పార్కింగ్ ఇబ్బందులను అధిగమించాలంటే తొందరగా ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దీనిపై పాలకులు వెంటనే స్పందించి వాడుకలోకి తీసుకువచ్చే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.