ఈ అద్భుతం ఎప్పుడైనా చూశారా.. 1008 రేకులతో వికసించిన పుష్పం..

by Sumithra |
ఈ అద్భుతం ఎప్పుడైనా చూశారా.. 1008 రేకులతో వికసించిన పుష్పం..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : షోలాపూర్‌లోని గణపతి ఘాట్ ( Ganapati Ghat )సమీపంలో ఉన్న సకుబాయి హీరాచంద్ నేమ్‌చంద్ కన్యా ప్రశాలలో అరుదైన అద్భుతమైన సహస్త్రదళ కమలం వికసించింది. ఈ ప్రత్యేకమైన పుష్పం ప్రత్యేకత ఏమిటంటే, ఇది 1008 రేకులతో ( 1008 petals ) వికసించింది. ఇది సాధారణ కమలం ( lotus ) కంటే భిన్నంగా ఉంటుంది. షోలాపూర్‌లో ఇలాంటి అరుదైన కమలం వికసించడం ఇదే తొలిసారి కావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ మొక్కను పెంచిన కమల ప్రియురాలు రేవతి కులకర్ణి మాట్లాడుతూ మొక్కలో మొత్తం మూడు మొగ్గలు ఉన్నాయని, వాటిలో రెండు ఇప్పటికే వికసించాయని చెప్పారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ తామర జాతిని విద్యార్థులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో నాటారని చెప్పారు.

సహస్రదళ కమలం లక్షణాలు..

రేవతి కులకర్ణి పుష్పం గురించి మాట్లాడుతూ సహస్రదళ కమలంలో 1008 రేకులు ఉన్నాయని తెలిపారు. ఇది 15 రోజుల పాటు వికసించి ఉంటుందని తెలిపారు. ఈ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే దాని బయటి రేకులు క్రమంగా రాలిపోతాయని, లోపలి రేకులు వికసిస్తాయని తెలిపారు. దీని కారణంగా దాని అందం చాలా కాలం పాటు అలాగే ఉంటుందని చెప్పారు. అంతే కాదు ఈ పువ్వు మంచి సువాసనను కూడా వెదజల్లుతుందని తెలిపారు. దాంతో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. మీరు ఆ సమీపంలో ఉంటే ఆ పుష్పాన్ని ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story