పీఆర్సీ కోసం లంచం.. యాక్షన్ తీసుకోరా..?

by Anukaran |
పీఆర్సీ కోసం లంచం.. యాక్షన్ తీసుకోరా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన బిల్లులు మంజూరు చేసేందుకు ట్రెజరీ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని టీపీటీఎఫ్ ఆరోపించింది. వేతన సవరణలో భాగంగా కింది నుంచి పై స్థాయి వరకు కొంత మంది ఉద్యోగులు, అధికారులు డబ్బులు వసూలు చేస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడేళ్లు నిరీక్షణ తర్వాత పొందుతున్న వేతన సవరణ ప్రక్రియను బాధ్యతగా చేయాల్సిన డీడీఓలు త్వరితగతిన మంజూరు చేసినందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఈ అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు సమర్పించుకున్న వారి బిల్లు ముందుగా పూర్తి చేసి డబ్బులు ఇవ్వని వారివి ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. డీడీఓలు లంచగొండి అవతారం ఎత్తడం సిగ్గుచేటన్నారు. పీఆర్సీ బిల్లు చేయడానికి స్టేషనరీ లేదని బిల్లు తయారీకి తగిన సిబ్బంది లేరని సాకులతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని టీపీటీఎఫ్ కోరింది.

Advertisement

Next Story

Most Viewed