- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలోనే కాదు.. వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు ఇవే.. అస్సలు మిస్ కావద్దు!
దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశంలో పర్యాటకులు సందర్శించేందుకు చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని వేసవి కాలంలో సందర్శించి ఎంజాయ్ చేస్తారు. మరికొన్ని శీతాకాలంలో సందర్శించవచ్చు. అలాగా వర్షాకాలంలో కూడా సందర్శించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే చాలా మంది వర్షాకాలంలో పచ్చని ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు. మరి అలాంటి వారి కోసం కొన్ని ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోనావాలా : భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఒక హిల్ స్టేషన్. ఇది పూణేకు పశ్చిమాన, ముంబైకి తూర్పున ఉంది. లోనావాలా పక్కనే ఉన్న ఖండాలా సముద్ర మట్టానికి 622 మీటర్ల ఎత్తులో ఉన్న జంట హిల్ స్టేషన్లు, డెక్కన్ పీఠభూమి, కొంకణ్ తీరాన్ని గుర్తించే సహ్యాద్రి శ్రేణులలో ఈ ఎత్తైన కొండలు విస్తరించి ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. లోనావాలాకు దగ్గరగా కర్లా గుహలు, భాజా గుహలు, బెడ్సా వంటి అనేక గుహలు ఉన్నాయి. దట్టమైన అడవులు, లోయలు, జలపాతాలు ఈ ప్రాంతంలో దర్శనం ఇస్తాయి. ఈ ప్రాంతానికి వెళ్లిన సందర్శకులు రాజ్మాచి పాయింట్, రాజ్మాచి కోట, రైవుడ్ పార్క్ & శివాజీ ఉద్యాన్, వాల్వన్ డ్యామ్, డెల్లా అడ్వెంచర్ పార్క్, లోనావాలా సరస్సు, డ్యూక్స్ నోస్, టైగర్స్ లీప్, కార్లా గుహలు, లోహగడ్ కోట, విసాపూర్ కోట, భూషి ఆనకట్ట, లయన్ పాయింట్, నారాయణి ధామ్, తుంగరలి ఆనకట్ట, షూటింగ్ పాయింట్ ఇవన్నీ సందర్శించవచ్చు.
కొడైకెనాల్ : తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. భారతదేశంలో స్థిరపడి వేడి తట్టుకోలేని ఇతర దేశస్థులు ఈ ప్రాంతానికి వచ్చి ఉండటానికి ఇష్టపడతారు. అమెరికా మిషనరీలు కొడైకెనాల్‌ను హిల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. కొడైకెనాల్ ప్రాంతంలో పూర్వం పళనీ గిరిజన ప్రజలు ఉండేవారు. పళని కొండలు, ఈ ప్రాంతం గురించి క్రీస్తు పూర్వం రాసిన ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావన ఉంది. 20వ శతాబ్దంలో ఈ ప్రాంతం అందాలు నచ్చిన కొంతమంది ధనవంతులైన భారతీయులు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కొడైకెనాల్‌ను "హిల్ స్టేషన్లలో యువరాణి" అని పిలిచేవారు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ అంతా పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
మున్నార్ : మున్నార్ కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. దక్షిణ భారతదేశంలోని అత్యంత చల్లని ప్రదేశాల్లో మున్నార్ ఒకటి. మున్నార్ పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1,600 మీటర్లు ఎత్తులో ఉంది. మున్నార్‌ను దక్షిణ భారతదేశంలోని కశ్మీర్ అని కూడా పిలుస్తారు. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా ఇక్కడికి హనీమూన్‌కు వస్తుంటారు. అలాగే వింటర్‌లో ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. పర్యాటకులు తప్పకుండా చూడవల్సిన అద్భుతమైన ప్రదేశాలలో మున్నార్ కూడా ఒకటి.
గోవా : గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. గోవాలో చక్కని బీచ్‌లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద, అగ్వాడ కోట - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి.