IRCTC Tour ప్యాకేజీ: ఈ మండు వేసవిలో అండమాన్ చూసొద్దామా..!

by Harish |   ( Updated:2023-05-18 12:24:37.0  )
IRCTC Tour ప్యాకేజీ: ఈ మండు వేసవిలో అండమాన్ చూసొద్దామా..!
X

దిశ, వెబ్‌డెస్క్: మండు వేసవిలో సముద్ర అలలు, ఇసుక తిన్నల్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..! అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొత్తగా అండమాన్ దీవులను చూసే అవకాశాన్ని అందిస్తోంది. టూరిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా ‘అమెజింగ్ అండమాన్’ పేరుతో ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇది 5 రాత్రులు, 6 రోజుల పాటు ఉంటుంది. దీనిలో భాగంగా పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్ ఐల్యాండ్, నీల్ ఐల్యాండ్, రాస్, నార్త్ బే ఐల్యాండ్ లాంటి ప్రదేశాలను చూపిస్తారు. అండమాన్ టూర్ ప్యాకేజీ మే 26న అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.




అండమాన్ టూర్ పూర్తి వివరాలు..

* మొదటిరోజు హైదరాబాద్ నుంచి విమానంలో టూర్ ప్రారంభమవుతుంది. ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి 9.15 గంటలకు పోర్ట్‌బ్లెయిర్ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తరువాత సెల్యులార్ జైల్ మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్‌కు సందర్శిస్తారు. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షో చూడొచ్చు. ఆ రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లో స్టే చేస్తారు.

* రెండో రోజు హేవ్‌లాక్ ఐల్యాండ్ దీవికి ఒడలో ప్రయాణం ఉంటుంది. హేవ్‌లాక్ చేరుకున్నాక మధ్యాహ్నం భోజనం చేసి రాధానగర్ బీచ్‌కు వెళ్తారు. ఆ రోజు రాత్రి హేవ్‌లాక్ ఐల్యాండ్‌లో బస చేస్తారు.

* మూడో రోజు హేవ్‌లాక్ ఐల్యాండ్ నుంచి కాలాపత్తర్ బీచ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి ఓడలో నీల్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత సాయంత్రం లక్ష్మణ్‌పూర్ బీచ్‌కు వెళ్లి సూర్యాస్తమయాన్ని చూడచ్చు.

* నాలుగో రోజు ఉదయ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాక, భరత్‌నగర్ బీచ్‌కు వెళ్లాలి. అక్కడ సొంత డబ్బులతో స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్ మొదలగు యాక్టివిటీస్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ వెళ్తారు. ఆ రాత్రి అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.

* ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక రాస్ ఐల్యాండ్‌కు వెళ్లాలి. కాసేపు అక్కడ గడిపాక, నార్త్ బే ఐల్యాండ్ వెళ్తారు. అక్కడ వాటర్ స్పోర్ట్స్, యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. ఆ తరవాత పోర్ట్‌బ్లెయిర్ వెళ్లి సముద్రిక మెరైన్ మ్యూజియం సందర్శించుకోవచ్చు. సాయంత్రం టైంలో షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రి అక్కడే స్టే చేస్తారు.

* ఆరో రోజు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఉదయం 9.55 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌లో విమానం ఎక్కితే మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.




టూర్ ధరలు:

* సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 55,780.

* డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 43,170.

* ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ. 42,885.


ప్యాకేజీలో భాగంగా లభించేవి: రెండు వైపులా విమాన టిక్కెట్లు, ఏసీ గదులు, నీల్ ఐల్యాండ్, హేవ్‌లాక్ ఐల్యాండ్, రాస్ ఐల్యాండ్, నార్త్ బే ఐల్యాండ్‌కు ఓడ ప్రయాణ ఖర్చులు, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్.

ప్యాకేజీలో లభించనివి: మధ్యాహ్నం భోజన ఖర్చు, విమానంలో భోజనం, సందర్శనీయ ప్రదేశాల వద్ద రుసుములు.




Advertisement

Next Story

Most Viewed