Kishan Reddy : బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డ్ : కిషన్ రెడ్డి

by M.Rajitha |
Kishan Reddy : బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డ్ : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బొగ్గు ఉత్పత్తి(Coal Production)లో భారత్(India) సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. ఏకంగా 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని భారత్ అధిగమించిందని, ఇది దేశానికే గర్వకారణం అని కొనియాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతుల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచామని తెలిపారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు ఇది తప్పకుండా పరిష్కారాన్ని చూపుతుందని ఆయన అన్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిని, ఇంధన భద్రతను పెంచుతుందని, కార్మికుల నిబద్ధతను లోకానికి చాటిచెబుతుందని అన్నారు. ఈ విజయంలో కార్మికులది కీలక పాత్ర అని తెలిపిన కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీలో భారత్ లీడర్ గా ఎదుగుతోందని పేర్కొన్నారు.

Advertisement
Next Story

Most Viewed