- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాపట్ల జిల్లా చరిత్రపై గేయం.. సింగర్ మనోకు బాధ్యతలు

దిశ ప్రతినిధి, బాపట్ల: బాపట్ల కలెక్టర్‌ను సింగర్ మనో మర్యాదపూర్వకంగా కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ కలెక్టర్‌ను ఆయన కలిశారు. జిల్లా గీతం స్వరకల్పనపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా గేయానికి స్వరకల్పన చేయాలని మనోను తాము కోరినట్లు కలెక్టర్ చెప్పారు. అయితే అడిగిన వెంటనే అంగీకరించడం పట్ల మనోకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా గీతాన్ని తయారు చేయాలని గత ఏడాది ఆదేశాల జారీ చేశానని, ఇందుకు భావపరి పుస్తకోద్యమ సమితి సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. బాపట్ల చరిత్ర ప్రతిబింబించే విధంగా గీతాన్ని రచించాలని రచయితలకు విజ్ఞప్తి చేస్తూ తాను పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు వచ్చిన పది ఎంట్రీలను అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి పరిశీలించారని చెప్పారు. భావపురి రచయుతల సంఘం కార్యదర్శి నందిరాజు విజయ్ కుమార్ రచించిన గీతాన్నిఎంపిక చేసినట్లు స్పష్టంచేశారు. బాపట్ల జిల్లా విశిష్టతపై ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సభ్యులు ప్రచురించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా మనోకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, కాకుమాను గురుకుల పాఠశాల సంగీత ఉపాధ్యాయుని అచ్యుతుని నాగపూర్ణ రమాదేవి, పుస్తకోద్యమ సమితి కార్యదర్శి జీవీ పాల్గొన్నారు.