- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్.. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

దిశ, చివ్వేంల: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనవరి 23 వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలల్లోని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి వారం రోజులలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. కలెక్టర్ పాఠశాలను సందర్శించి రెండు నెలలు కావస్తున్న.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తిగా కాకపోవడంతో దిశ వెబ్ లో కలెక్టర్ మాట పట్టించుకోని కాంట్రాక్టర్... కథనం గురువారం ప్రచురితం అయ్యింది. దీంతో శుక్రవారం బండమీది చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీవో సంతోష్ కుమార్, సందర్శించారు. పనులు పూర్తిగాక పోవడానికి గల కారణాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఎంఈఓ రమణ,ఆర్ &బి ఏ ఈ యుగంధర్ , పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.