అనుమతులు లేని బయో మందులు స్వాధీనం

by Sridhar Babu |
అనుమతులు లేని బయో మందులు స్వాధీనం
X

దిశ, ఏటూరు నాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన బయోప్రొడక్ట్ మందులను పోలీస్, అగ్రికల్చర్ శాఖ అధికారులు గురువారం అర్ద‌రాత్రి పట్టుకున్నారు. 6 లక్షల విలువ గల బయో మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్‌టీఆర్ జిల్లా, కందిచ‌ర్ల గ్రామానికి చెందిన రావూరి వెంక‌టేశ్వ‌ర్ రావు అనే వ్య‌క్తి ఏటూరునాగారం మండ‌ల కేంద్రంలోని ఆకుల‌వారి ఘ‌ణ‌పురం కాల‌నీలోని ఇంట్లో అద్దెకు ఉంటూ గ‌త కొద్ది కాలంగా అనుమ‌తులు లేకుండా బ‌యో ప్రొడ‌క్ట్ మందులు నిల్వ చేసి నూగూరు వెంక‌టాపురం, చ‌ర్ల మండ‌లాల్లో విక్ర‌యిస్తున్నాడు.

ఈ మేరకు న‌మ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు గురువారం ఆర్ద‌రాత్రి ఎస్సై తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది, అగ్రిక‌ల్చ‌ర్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వ‌హించి 410 లీట‌ర్ల ద్ర‌వ ప‌దార్ధం, 30 కేజీల ఘ‌న ప‌దార్దం గ‌ల బ‌యో ప్రొడ‌క్ట్ మందుల‌ను, ఓ వ్యానును ప‌ట్టుకున్నారు. నిందితుడిపై కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రైతుల‌ను మోసం చేసే విధంగా న‌కిలీ విత్త‌నాలు, న‌కిలీ మందులు, అనుమ‌తులు లేని బ‌యో మందులు విక్ర‌యిస్తే వారిపై చట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. అలాగే యువ‌త ఆన్ లైన్ బెట్టింగ్ ల‌కు పాల్పడి త‌మ బంగారు భ‌విష్య‌త్​ నాశనం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు.

Advertisement
Next Story

Most Viewed