వారికోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పరెంట్ మాస్క్‌లు

by vinod kumar |
వారికోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పరెంట్ మాస్క్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో స్వీయ రక్షణ కోసం తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. మనందరి సంగతి సరే గానీ.. చెవిటివాళ్లు, చెవులు సరిగ్గా వినిపించని వాళ్లు మాస్క్ పెట్టుకోవడం వారికి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే.. వాళ్లు లిప్ రీడింగ్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఇతరులతో కమ్యూనికేట్ అవుతారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారంగానే డెహ్రాడూన్ బేస్డ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఈపీవీడీ) సంయుక్తంగా ట్రాన్స్‌పరెంట్ మాస్క్‌లను రూపొందించాయి.

మార్కెట్లో లభిస్తున్న భిన్న రకాల మాస్క్‌లు కరోనా నుంచి రక్షణనివ్వగలవు కానీ, కమ్యూనికేషన్‌కు అడ్డుగా ఉంటాయి. వినికిడిలోపం ఉన్నవారిలో 70 శాతం మంది నాన్ వర్బల్‌గానే కమ్యూనికేట్ అవుతుంటారు. అందులో లిప్ రీడింగ్ చాలా ప్రధానం. అంతేకాదు కొంతమంది చిన్నారులు ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్‌ను ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు కూడా ఇది చక్కని పరిష్కారం. ‘సైన్’ లాంగ్వేజ్ ఉన్పప్పటికీ వినికిడి లోపం ఉన్న వారు లేదా చెవిటివారు అంతగా ఉపయోగించరు. అటువంటి వారికి ఈ మాస్క్‌లు ఉపయోగపడగలవు.

ఎలా తయారు చేశారు ? ఎంతమంది వాడుతున్నారు?

కాటన్, బయోడీగ్రేబుల్ ప్లాస్టిక్ (మేడ్ ఆఫ్ షుగర్‌కేన్ ఫైబర్)తో ఈ మాస్క్‌లు తయారు చేశారు. మాస్క్‌కు కింద, మీద కాటన్ ఉండగా మధ్యలో ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. ఇప్పటికే 1000కి పైగా మాస్కులు తయారుచేసిన ఎన్ఐఈపీవీడీ.. 250 మాస్క్‌లను ఉత్తరాఖండ్ పోలీసులకు అందించింది. 60 ఏళ్ల పైబడిన వాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుండగా.. వినికిడిలోపం ఉన్న యువకులు, చిన్నారులు ఇప్పటికే వీటిని వాడుతున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజెబిలిటీ అఫైర్స్ ఆమోదం తెలిపితే గనుక అందరికీ చేరువలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ మాస్క్ ధర రూ. 20 మాత్రమే.

Advertisement

Next Story