- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి నుంచి .. పుట్టిన బిడ్డకు కరోనా వస్తుందా?
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ.. వైద్యులకు, శాస్ర్తవేత్తలకు, ప్రభుత్వ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీల మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణీ తల్లి నుంచి గర్భంలో ఉండగానే, లేదా ప్రసవం ద్వారా శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదముందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం తెలిపింది. అయితే గర్భిణీలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు, బిడ్డకు సంక్రమణ తీవ్రత ఏ మేరకు ఉంటుందనేది ఇంకా గుర్తించలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా ప్రభావం గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు ఎలా ఉంటుందో ఐసీఎంఆర్ కొన్ని విషయాలను పేర్కొంది. సార్స్, మెర్స్ వైరస్ లు గర్భిణీల మీద చూపిన ప్రభావం, కరోనా గురించి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీ స్త్రీ నుండి కడుపులో ఉన్న బిడ్డకు లేదా ప్రసవించిన నవజాత శిశువుకు కరోనా వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే తల్లి పాలల్లో ప్రాణాంతక వైరస్ లక్షణాలున్నాయని నిరూపించడానికి ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే గర్భిణీలు, నవ జాత శిశువుల మీద వైరస్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు అందుబాటులో లేవని తెలిపింది. కానీ గర్భిణీలకు కరోనా సోకితే తీవ్రమైన సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంది. కనుక కరోనా పాజిటివ్, న్యుమోనియాలాంటి శ్వాసకోశ వ్యాధి తీవ్రంగా వుంటే, పుట్టిన తరువాత బిడ్డను తల్లినుంచి తాత్కాలికంగా వేరు చేయడం ఉత్తమమని సూచించింది. అలాగే వైరస్.. పిండం ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందా అన్నదానిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంది. దీంతోపాటు గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు అత్యధిక ప్రమాదంలో ఉంటారని, ఎప్పటికంటే ఎక్కువగా వైద్యుల పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. . కోవిడ్ -19 సోకిన గర్భిణీలలో న్యుమోనియా లక్షణాలున్నప్పటికీ త్వరగా కోలుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలో కరోనా సోకిన మహిళలందరి జాబితాను నమోదు చేయాలని, ఫలితాలతో సహా తల్లీబిడ్డల ఆరోగ్య రికార్డులు వివరంగా నింపి, భవిష్యత్తు విశ్లేషణ కోసం భద్రపరచాలని సూచించింది. అలాగే కరోనా వైరస్ సోకినంత మాత్రాన గర్భ విచ్ఛిత్తి చేసుకోవాల్పిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
Tags: coronavirus, covid 19, pregnant women, icmr, newborn babies