తోటి ట్రాన్స్ జెండర్లకు ఉచిత భోజనం అందిస్తున్న.. వీణ

by vinod kumar |   ( Updated:2020-04-17 03:12:13.0  )
తోటి ట్రాన్స్ జెండర్లకు ఉచిత భోజనం అందిస్తున్న.. వీణ
X

దిశ వెబ్ డెస్క్: బెంగళూరులోని గాంధీనగర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ వీణ.. ఆక్టివిస్ట్ గా ముందుకు సాగుతోంది. సెక్స్ వర్కర్స్, సెక్సువల్ మైనారిటీస్ ల కోసం పాటు పడే ‘సాలిడరిటీ ఫౌండేషన్’ లో పనిచేస్తోంది. వారి కోసం నిత్యం పాటు పడే వీణ.. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి తన తోటి ట్రాన్స్ జెండర్లతో పాటు, వీధి వ్యాపారులకు, దినసరి కూలీలకు, పేదలకు ఆహారం అందిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి లేకపోవడంతో ఆహారం కోసం తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది దయార్ద హృదయులు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాన్స్ జెండర్ వీణ కూడా.. తన తోటి ట్రాన్స్ జెండర్ల ఆకలి తీర్చేందుకు పూనుకుంది. ‘మా కమ్యూనిటీ వాళ్లకు ఉపాధి లేదు. లాక్ డౌన్ కారణంగా వాళ్లంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మిగతా వాళ్లతో పోలిస్తే.. వారికి మరింత ఎక్కువ సపోర్ట్ కావాలి. అందుకే వారి కోసం సాయం చేస్తున్నాను. అంతేకాదు లాక్ డౌన్ అమల్లోకి రావడంతో.. నా చుట్టుపక్కల వాళ్లపై ప్రభావం పడుతుందని అనుకున్నాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇదే నా ఇల్లు. వాళ్లంతా బాధపడుతుంటే.. చూస్తే ఉండలేకపోయాను. ఇక్కడ ఎక్కువగా దినసరి కూలీలు, వీధీ వ్యాపారులు ఉన్నారు. ప్రతి రోజు 50 కిలోల ఆహారాన్ని పంచాను. ఇందులో 200 పార్సిల్స్ ఒకలిపురంలోని ట్రాన్స్ జెండర్లకు పంచాను. ఏప్రిల్ 5 వరకు కొందరు ఎన్జీవోల సాయంతో ఈ పని చేస్తూ వచ్చాను’ అంటూ వీణ పేర్కొంది. అంతేకాదు ఇంటింటికీ తిరిగి ఫ్రీ రేషన్ కూడ అందించింది.

మరింత సాయం:

వీణ చేసే పని నచ్చడంతో.. ‘అద్యార్ ఆనంద్ భవన్ ’అనే లోకల్ రెస్టారెంట్ యాజమాన్యం.. మరింత సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. వీణ ప్రస్తుతం ప్రతిరోజు 1200 ఫుడ్ ప్యాకెట్స్ పంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

tags :coronavirus, lockdown, bangalore, transgender veena, helping poor

Advertisement

Next Story

Most Viewed