కేరళలో కుప్పకూలిన శిక్షణ విమానం..!

by Anukaran |
కేరళలో కుప్పకూలిన శిక్షణ విమానం..!
X

దిశ, వెబ్‎డెస్క్: కేరళలోని కొచ్చిలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నౌకాదళులు ఇద్దరు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. సదరన్ నావల్ కమాండ్ (ఎస్ఎన్‎సీ) ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో విమానం కూలిపోయింది. ఐఎన్ఎస్ గరుడ నుంచి టేకాఫ్ అయిన కాసేపట్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నౌకాదళులు రాజీవ్ ఝా, సునీల్ కుమార్ మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Next Story