షాకింగ్.. 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణికులు

by srinivas |
షాకింగ్.. 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని పలాస రైల్వేస్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్‌ను రైలు ఢీకొట్టి 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ప్రమాదాన్ని చూసిన రైల్వే ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పలాస రైల్వే స్టేషన్‌లో ఓ రోగిని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని రైలు ఢీకొట్టింది.

ఈ క్రమంలోనే అంబులెన్స్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దృశ్యాన్ని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులు చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అంబులెన్స్ డ్రైవర్, డాక్టర్ సేవ్ అయ్యారు. అంబులెన్స్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.

Advertisement

Next Story

Most Viewed