సీఎం సభ కోసం ట్రాఫిక్ ఆంక్షలు

by Shyam |
సీఎం సభ కోసం ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎల్‌బీ నగర్ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా ఆ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ బీజేఆర్ విగ్రహం వైపుగా కాకుండా, ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా చాపెల్ రోడ్, నాంపల్లికి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలన్నారు. అబిడ్స్, గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ బషీర్ బాగ్ బీజేఆర్ విగ్రహాం వైపు కాకుండా, గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ వద్ద చాపెల్ రోడ్డుకు మళ్ళిస్తున్నట్టు తెలిపారు.

బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి జీపీఓ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠి మీదుగా అబిడ్స్ వైపు మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్ బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. లిబర్టీ నుంచి బషీర్ బాగ్ జంక్షన్ వరకూ వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపుగా లిబర్టీ వెళ్లాలన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్ బాగ్ జంక్షన్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ , లిబర్టీ వైపు మళ్లించబడుతుందన్నారు. సమావేశానికి హజరయ్యే ప్రజల వాహనాలను గేట్ల వరకూ మాత్రమే అనుమతించబడుతోందని అన్నారు. పౌరులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలని ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు.

పార్కింగ్ స్థలాలు ఇవే..

– సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఎల్ బీ స్టేడియం జి-గేటు వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్, రవీంద్ర భారతీ మీదుగా ఐమాక్స్ థియేటర్ వద్ద డాక్టర్స్ కార్స్ పార్కింగ్ లో పార్క్ చేయాలి.

– ఎల్‌బీ నగర్, దిల్‌సుక్‌నగర్, ఓల్డ్ సిటీ నుంచి వచ్చే వాహనాలు ఏఆర్ పెట్రోల్ పంపు వద్దకు మాత్రమే అనుమతిస్తారు. పబ్లిక్ గార్డెన్, పీపుల్స్ ప్లాజాలో పార్క్ చేయాల్సి ఉంటుంది.

– ముషీరాబాద్, అంబర్ పేట, హిమాయత్ నగర్ నుంచి వచ్చే వాహనాలననీ ఎఫ్, ఎఫ్-1 గేట్లు వద్ద దిగాలి. అనంతరం నిజాం కాలేజీ గ్రౌండ్ 2, 3 గేట్ల ద్వారా నిజాం కళాశాలలో పార్కింగ్ చేయాలి.

– మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలన్నీ ఎల్‌‌బీ స్టేడియం జి-గేట్ వరకూ మాత్రమే అనుమతి ఉంటుంది. అయాకర్ భవన్, నిజాం కాలేజ్ గ్రౌండ్ -2 & 3 గేట్ల వద్ద పార్కింగ్ చేయాలి.

Advertisement

Next Story