- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ నేతల్ని ఇంటి దొంగలన్న కాంగ్రెస్ నేత
దిశ, కరీంనగర్: గులాబీ నేతలపై కాంగ్రెస్ నేత పొన్నం ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నా అధికార టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశాడు. గురువారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జలదోపిడికి పాల్పడిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రస్తుతం కృష్ణా నీటిని పక్కరాష్ట్రానికి ఇస్తూ ఇంటి దొంగగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనికి అధికార టీఆర్ఎస్‌ను ఏమనాలని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రెండు నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అప్పటికే నిర్మాణం అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తల మార్చి నేనే అంతా చేశానని గొప్పలకు పోతున్నారని పొన్నం మండిపడ్డారు. ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ, శ్రీరాంసాగర్, సగం వరకు మిడ్ మానేరు ప్రాజెక్టునుల ఎవరు నిర్మించారో గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు 64 జీఓ తయారు చేశారని పొన్నం ఆరోపించారు. రైతాంగ సమస్యల గురించి కొనుగోలు కేంద్రాలకు వెల్లే తమపై కేసులు పెట్టాలనే ఈ జీఓ తీసుకొచ్చారని విమర్శించారు. పర్చేసింగ్ సెంటర్లకు వెల్లే అధికార పార్టీ నేతలపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని అన్నారు. 64 జీఓను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అదనంగా రెండు కిలోలు తరుగు తీయాలని సర్కారే అనధికారికంగా చెప్పిందని ఆరోపించారు. లేనట్టయితే అదనంగా ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్ర నిర్వహకులపై కేసులు ఎందుకు పెట్టడం లేదని పొన్నం ప్రశ్నించారు.