- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి టీపీసీసీ షోకాజ్ నోటిసులు..
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడితో పాటు మరో ఇద్దరు లీడర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9,10న కొంపల్లిలో డిజటల్ మెంబర్‌షిప్ శిక్షణా తరగతులను నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. కొందరు కాంగ్రెస్ శ్రేణులు పార్టీ క్యాడర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బూతులు తిట్టడంతో తీవ్ర వివాదాస్పదం అయ్యింది. అంతేకాకుండా పాసుల విషయంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై శ్రేణులు సభలోనే పలు ఆరోపణలు చేశారు.
ఈ ఘటనను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవ రెడ్డి, జనగాం ఏఎంసీ మాజీ ఛైర్మన్ యారమళ్ల సుధాకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మీదె శ్రీనివాస్‌లు ఈనెల 29వ తేదీలోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా సంఘం ఆదేశించింది.