బిగ్‌ బ్రేకింగ్ : హుజురాబాద్‌‌‌ బై పోల్‌కు కాంగ్రెస్ ఇన్‌చార్జిలు వీరే..

by Sridhar Babu |   ( Updated:2021-07-13 23:29:09.0  )
Revanth-Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన దూకుడును మరింత పెంచారు. ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హుజురాబాద్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలు, మండల బాధ్యులను నియమించారు. అయితే, ఉపఎన్నికలో సత్తా చాటేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ సీనియర్లకు రేవంత్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ నియామకం కాగా.. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, శ్రీధర్ బాబు ఎమ్మెల్యే, పొన్నం ప్రభాకర్ (మాజీ ఎంపీ)లకు బాధ్యతలు అప్పగించారు. ఇక మండలాల వారీగా చూసుకుంటే..

వీణవంక మండలం..
ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్..

జమ్మికుంట మండలం..
విజయ రమణ రావు, రాజ్ ఠాగూర్ (మక్కన్ సింగ్)

హుజురాబాద్ మండలం..
టి. నర్సారెడ్డి, లక్షణ్ కుమార్..

హుజురాబాద్ టౌన్..
బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు

ఇల్లంతకుంట మండలం..
నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కమలపూర్ మండలం..
కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య..

కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త..
కవ్వంపల్లి సత్యనారాయణ..

సమాచారం కోసం దొంతి గోపి లను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు.

Read more: Kisan Vikas Patra : రూ. 5లక్షల పెట్టుబడితో 10 లక్షల ఆదాయం..

Advertisement

Next Story