- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టయోటా కీలక నిర్ణయం.. ధరల ప్రభావం ఎంత అంటే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) వచ్చే ఏడాది నుంచి తన కార్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. వాహన తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోతున్న కారణంగా జనవరి నుంచి మొత్తం పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఉత్పత్తులపై ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ముడి పదార్థాలతో పాటు ఇన్‌పుట్ ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారంగా మారిందని, ధరల పునర్నిర్మాణం అవసరమని భావించాము.
ఈ నేపథ్యంలో వినియోగదారులపై తక్కువ ప్రభావాన్ని చూపే విధంగా కార్ల ధరలను పెంచనున్నామ’ని కంపెనీ తన ప్రకటనలో వివరించింది. ఎంతమేర ధరలను పెంచనున్నారన్న దానిపై మాత్రం టయోటా కిర్లోస్కర్ స్పష్టత ఇవ్వలేదు. కాగా దేశీయ ఆటో పరిశ్రమలో ఇప్పటికే కీలక కంపెనీలు ఇన్‌పుట్ ఖర్చులు భరించలేక ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. వీటిలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హోండా కార్స్ సహా దిగ్గజ సంస్థలు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంగా ఉక్కు, రాగి, అల్యూమినియం సహా విలువైన లోహాల వంటి వాహనాల తయారీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీలు ధరలను పెంచుతున్నాయి.