నా కోరిక తీర్చాలంటూ ఒంటరి మహిళలకు టార్చర్.. చివరగా లైంగిక దాడులు..!

by Anukaran |   ( Updated:2021-07-12 23:37:01.0  )
jawahar-nagar-crime
X

దిశ, వెబ్‌డెస్క్ : జవహర్ నగర్ చిన్నారులపై లైంగిక దాడుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్ విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని తన కోరికలు తీర్చాలంటూ అభిరామ్ దాస్ టార్చర్ చేసేవాడని తేలింది. వారు అంగీకరించకపోయేసరికి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

అయితే, పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి తనను కాల్చివేయాలని నిందితుడు విచారణలో వేడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు డ్రగ్స్‌కు సైతం బానిసైనట్లు తెలిపారు. కాగా, ఈ నెల 4న మూడేండ్ల బాలికను కిడ్నాప్ చేసిన అభిరామ్ దాస్ అత్యాచారం చేయడమే కాకుండా, మరో బాలికను ఈనెల 9న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. తన భార్య సంసారానికి పనికిరావని చెప్పడంతోనే డ్రగ్స్‌కు బానిసై మహిళలపై కోపం పెంచుకున్న నిందితుడు.. తన కోరికను ఒంటరి మహిళలు కాదన్నందుకు ప్రతీకారంగా చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు అభిరామ్ దాస్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

Advertisement

Next Story