హ్యాండిల్ చేయడం కష్టమే.. తార హాట్ పిక్స్‌పై బాయ్‌ఫ్రెండ్

by Shyam |
హ్యాండిల్ చేయడం కష్టమే.. తార హాట్ పిక్స్‌పై బాయ్‌ఫ్రెండ్
X

దిశ, సినిమా : గార్జియస్ యాక్ట్రెస్ తార సుతారియా.. రీసెంట్‌గా తన ఇన్‌స్టా్గ్రామ్‌ హ్యాండిల్‌లో కొన్ని సూపర్ హాట్ పిక్చర్స్ పోస్ట్ చేసింది. మేని అందంతో మెరిసిపోతున్న తన బికినీ ఫొటో షూట్ పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ చిత్రాలు చూసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యాన్స్ తనపై కామెంట్ల వర్షం కురిపిస్తుండగా.. డ్రూలింగ్ ఎమోటికాన్, ఫైర్ ఎమోజీతో పాటు బ్లాక్ హార్ట్‌ సింబల్‌తో రిప్లయ్ ఇచ్చాడు బాయ్‌ఫ్రెండ్ ఆధార్ జైన్. ఇందుకు తార కూడా మూడు బ్లాక్ హార్ట్ సింబల్స్‌తో బదులిచ్చింది. 2019 నుంచే డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. 2020లో తమ రిలేషన్‌షిప్‌ను కన్‌ఫర్మ్ చేశారు. అయితే కొన్ని వారాల క్రితమే తార, ఆధార్ జైన్‌కు ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్తలు రాగా.. ఆ రూమర్స్‌ను కొట్టిపారేశారు. ఫిల్మ్ కెరీర్ పరంగా ఆధార్ నటించిన ‘హలో చార్లీ’ ఏప్రిల్‌లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కాగా.. తార ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో నటిస్తోంది.

https://www.instagram.com/p/CRqnmoTpTvo/?utm_source=ig_embed&ig_rid=e4e4c59a-2998-4d0e-9190-689cdac5c0cf

Advertisement

Next Story