తారక రాముడి స్మరణలో..

by Shyam |   ( Updated:2020-05-28 05:59:01.0  )
తారక రాముడి స్మరణలో..
X

సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు.. రాజకీయ చరిత్రలో మడమతిప్పని రారాజు. సినీ, రాజకీయ రంగాలను శాసించి.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఖ్యాతి ఎన్టీఆర్‌ది. ఆయన జీవితం తెరిచిన పుస్తకమే.. రీల్ అండ్ రియల్ లైఫ్ లెజెండ్ విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ ఎన్టీఆర్ 98వ జయంతి పురస్కరించుకుని సినీ ఇండస్ట్రీ ఆ ఆరడుగుల ఆదర్శమూర్తిని స్మరించుకుంది. దేవతామూర్తుల నిజస్వరూపాన్ని వెండితెర పై సాక్షాత్కరించిన అభినయ సౌందర్య మూర్తికి అంజలి ఘటించింది.

తెలుగు నేల గుండెల్లో చెదరని జ్ఞాపకం..

తెలుగు జాతి ఇలవేల్పు అన్న ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ఆయనను స్మరించుకున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆ మహానుభావుడి తో ఉన్న ఫోటోను షేర్ చేసిన చిరు.. తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం అన్నారు. వారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.

https://twitter.com/KChiruTweets/status/1265848348411486208?s=09

మీరు లేని లోటు తీరనిది..

మీరు లేని లోటు తీరనిది అంటూ తాత ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు తారక్. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబో తోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లుతోంది.. పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాత అంటూ వేడుకున్నాడు జూనియర్.

https://twitter.com/tarak9999/status/1265806904845983744?s=19

భారతరత్న తో గౌరవించుకుందాం..

నందమూరి తారక రాముడి వీరాభిమాని, బొమ్మరిల్లు సంస్థ అధినేత YVS చౌదరి నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో నిన్ను కొలుచు భాగ్యం ఇంకెప్పుడు ప్రభూ ఈ జన్మకూ అంటూ ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు. తెలుగు జాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని తెగువని ప్రపంచపు నలుమూలల చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఉభయ రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా పేరుతో నామకరణం జరపాలని కోరుకున్నారు. ఆయనను భారతరత్న గా చూడాలనుకున్న తెలుగువారి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రయత్నించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాన్ని కోరారు.

మా ఖ్యాతి మీరే.. మా కీర్తి మీరే..

మా ఖ్యాతి మీరే.. మా కీర్తి మీరే .. అంటూ తాత ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు కళ్యాణ్ రామ్. ఓ విశ్వ విఖ్యాత మీగాథ మీబోధ మాకు భగవద్గీత.. మీ ఘనత మీ చరిత నిర్మించే మా భవిత.. అమరపురి అధినేత అందులో మా జ్యోత అంటూ తాతకు నివాళులు అర్పించారు.

https://twitter.com/NANDAMURIKALYAN/status/1265807899965546501?s=19

నా జీవితంలోనే పెద్ద అచీవ్ మెంట్..

నా సినిమా ప్రయాణం చాలా ఎక్కువే.. ప్రశంసలు, పురస్కారాలు కూడా అధికమే.. కానీ వీటన్నిటికీ మించి గొప్ప గౌరవం.. మహనీయుడు ఎన్టీఆర్ తో నటించడమే అని తెలిపారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. ఇది నా జీవితంలోనే పెద్ద ఆచీవ్ మెంట్ గా భావిస్తున్నాను అన్నారు.

https://twitter.com/Ragavendraraoba/status/1265837261574168576?s=20

తెలుగు ఆత్మగౌరవ నినాదం..

ప్రతి పాత్రను తన వశం చేసుకున్న మహానటుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తన నినాదంగా మార్చుకున్న మహానేత, తన పాలనతో పేదవాళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు.. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు కోనా వెంకట్.

https://twitter.com/konavenkat99/status/1265857759800553477?s=20

యుగపురుషుడికి నివాళి

యుగపురుషుడు తారకరముడు జయంతిన ఆయనను స్మరించుకుంటూ.. ఒక చిన్న కథ ఆ పెద్దాయన మీద అంటూ ఓ వీడియో ద్వారా నివాళులు అర్పించింది వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ. ఆయన తెలుగు జాతి విశ్వరూపం..తెలుగు సినిమా గర్వపడే హిమాలయ శిఖరం.. ఆయన సువర్ణ హస్తలతోనే బారసాల చేసుకున్న వైజయంతి మూవీస్ లో అడుగుమోపిన మొట్టమొదటి వ్యక్తి ఆ మహనీయుడే అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు అశ్వినీదత్. ఎదురులేని మనిషి షూటింగ్ టైమ్ లో కుర్చీ పై కూర్చుని ఉన్న ఎన్టీఆర్ అశ్వినీదత్ ను చూడగానే వెంటనే లేచి నిల్చు న్నారట. సార్ మీలాంటి పెద్దవాళ్లు నన్ను చూసి నిలుచోవడం ఎంటి అంటే.. నిర్మాతగా ఇంతమందికి పని కల్పించి అన్నం పెడుతున్నారు.. మీకు గౌరవం ఇచ్చుకోవడం మా బాధ్యత అన్నారట. ఆయన మనిషికి ఇచ్చే విలువ అంత గొప్పది అన్న మాట.

https://twitter.com/VyjayanthiFilms/status/1265888124665622528?s=19

Advertisement

Next Story

Most Viewed