ఆ వీడియో చూసి చెప్తున్నా.. ఆ నరికినోడితో పడుకుంటా- నటి

by Anukaran |   ( Updated:2021-08-17 22:59:14.0  )
ఆ వీడియో చూసి చెప్తున్నా.. ఆ నరికినోడితో పడుకుంటా- నటి
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణహత్య ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై రమ్యను అతికిరాతకంగా నరికి చంపాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఈ ఘటనపై సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. రమ్యను పొట్టనబెట్టుకున్న శశికిరణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

టాలీవుడ్ లో ‘దామిని విల్లా’, ‘రంగేలా’, ‘కళ్యాణ తస్మై నమహ:’ లాంటి పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నటి రేఖ భోజ్ తన ఫేస్ బుక్ పేజీలో రమ్య హత్య గురించి భాధపడుతూ ” వాడ్ని కూడా అలానే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా.. ఐయామ్ సారీ..ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు.. అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు.. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి.. రమ్యా నీకు న్యాయం జరగాలి.. రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్” అంటూ ‘ఊసరవెల్లి’ లోని తమన్నా పిక్ ని పోస్ట్ చేసింది.

‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా తనకు సాయం చేస్తే పడుకుంటా అని ఎన్టీఆర్ తో అంటూ ఆవేదన వ్యక్తం చేసే సీన్ ని గుర్తు చేసింది. అందులో తమన్నా తన ఫ్యామిలీని చంపినవారిని చంపడానికి ఏదైనా చేస్తానని, చివరికి నీతో పడుకోమన్నా పడుకుంటాను అని చెప్తుంది. రమ్యకు జరిగిన తీరును చూసిన ఆవేదనతోనే తాను ఇలా పోస్ట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చారు. నెటిజన్లు తప్పుగా అనుకోవద్దని తెలిపింది. రేఖ చేసిన వ్యాఖ్యలను కొందరు సమసర్దిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. రమ్య హత్య ఎంతోమందిని కలచివేసింది.. కానీ, రేఖా గారు ఇలా ‘పడుకొంటాను’ అనే మాట వాడకండి.. చాలామంది దాన్ని పబ్లిసిటీ కోసం వాడుకొని మిమ్మల్ని రోడ్డుమీదకు లాగుతారు అంటూ హితబోధ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed