- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో ఎదురయ్యే సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ ధరణి కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా ప్రకటించారు. రాజనర్సింహా ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ చైర్మన్ వెల్లడించారు. న్యాయ సహాయం, న్యాయ సలహాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ధరణి కమిటీ పర్యటిస్తుందని, రైతులు, బాధితులతో నేరుగా మాట్లాడుతామన్నారు. అదేవిధంగా ధరణి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. 040–24615602, 040–24601254 నెంబర్లకు కాల్ చేసి బాధితులు సమస్యలు చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.