- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా తగ్గుముఖం… నేడు ఏపీ @ 33
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా బయపడుతున్న కరోనా పాజిటివ్ కేసుల గణాంకాలు చూస్తే ఈ విషయం తెలుస్తోంది. గత గురువారం అంటే మే 7వ తేదీన 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8వ తేదీన 54 కేసులు, 9వ తేదీన 43, 10వ తేదీన 50, 11వ తేదీన 38, నేడు 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 2051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో 9 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. నిన్నటి వరకు కొత్త కేసులతో ఆందోళన పరిచిన అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో నిన్న కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాకపోవడం విశేషం. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదైతే ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు.
ఈ రోజు గుర్తించిన 33 కేసుల్లో చిత్తూరు 10 కేసులు, నెల్లూరు 9, తూర్పుగోదావరి 1 కేసు వెరసి 20 పాజిటివ్ కేసులు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో సోకినవిగా నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటి వరకు 2051 మందికి కరోనా సోకితే.. వారిలో 949మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 1056 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తొలిసారి చికిత్స పొందుతున్న వారి కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా నమోదు కావడం. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకు 46 మంది మరణించారు. నిన్న ఒక్కరోజు 33 మందికి సోకితే 56 మంది డిశ్చార్జ్ అయ్యారని ఏపీ వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.