ధరణితో వారికే లాభం.. కోదండరాం ఆరోపణ

by Shyam |   ( Updated:2021-09-22 02:12:53.0  )
Kodandaram
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. బుధవారం అఖిలపక్షాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని, కొవిడ్ కారణంగా ఎంతోమంది జీవితాలు ఆగం అయ్యాయన్నారు. సంపన్నులకు లాభం చేకూర్చేలా ధరణి చట్టం ఉందని, అసలు ధరణిలో అప్లికేషన్లు తీసుకునేవాళ్లు ఎవరో తెలియదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భూ సేకరణ పేరుతో ప్రభుత్వం ఇష్టానుసారంగా భూమిని సేకరించిందని, భూములు కోల్పోయినవారికి ఇప్పటివరకు కూడా ప్రత్యామ్నాయం చూపలేదన్నారు. ప్రభుత్వం ఇసుక దందాలు, భూ దందాలు చేస్తోందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే, దోపిడీకి పాల్పడుతోందని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story