- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఔత్సాహిక టెక్కీలకు టీటా ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తమతో కలిసి నడిచే వారి కోసం నూతన సభ్యత్వ నమోదుకు ఆహ్వానం పలికింది. టీటా గ్లోబల్ కమిటీ- 2020 కాలపరిమితి డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్తగా సభ్యులను చేర్చుకోనున్నారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ మెంబర్‌షిప్, ఎన్నారైలు, విద్యార్థులు, అసోసియేట్ సభ్యులు, ఐటీ ఫ్యాకల్టీ, ప్రభుత్వ రంగం నుంచి ఐటీ విభాగంలో ఉన్న వారంతా సభ్యులుగా చేరవచ్చునని టీటా గ్లోబల్ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మంగళవారం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలు, జిల్లా కమిటీలకు సైతం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఔత్సాహికులకు సభ్యత్వ విషయంలో సహాయ సహకారాలు అందించాలన్నారు. ఔత్సాహికులు bit.ly/joinTITA లింక్ ద్వారా సభ్యులుగా చేరవచ్చు. నామినేషన్లు పంపేవారు [email protected] ఈ మెయిల్‌కు ప్రతిపాదించొచ్చునన్నారు. సాంకేతిక అక్షరాస్యత కోసం గ్రామాలను దత్తత తీసుకోవడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం డిజిథాన్ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. టీటా కృషిని చూసి దేశ విదేశాల్లో సైతం వివిధ శాఖలు ఏర్పాటు అయ్యాయన్నారు.