చై చేతుల మీదుగా ‘టిక్ టిక్ టిక్’

by Shyam |
చై చేతుల మీదుగా ‘టిక్ టిక్ టిక్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
గతంలో ‘మనోడు, టాస్’ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శిని రామ్.. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘కేస్ 99’ అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సొసైటీలో పెరిగిపోతున్న క్రైమ్‌ రేటుకు హ్యుమన్ ఎమోషన్స్‌ను కనెక్ట్ చేసి తీస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. ఈ సినిమా నుంచి ‘టిక్ టిక్ టిక్’ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. నవంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘టిక్ టిక్ టిక్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రానికి ఆషిక్ అరుణ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తు్న్నారు. ఇక ఈ పాటకు ప్రియదర్శిని రామ్ సాహిత్యాన్ని అందించగా, ఇషాక్ వలీ ఆలపించారు. ఇందులో ప్రియదర్శిని రామ్ లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం.

Advertisement

Next Story