గురువారం పంచాంగం, రాశిఫలాలు (29-04-2021)

by Hamsa |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : తదియ రా2 36
తదుపరి చవితి
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : అనూరాధ సా6.26
తదుపరి జ్యేష్ఠ
యోగం : వరీయాన్ మ3.32
తదుపరి పరిఘము
కరణం : వణిజ మ3.47
తదుపరి భద్ర/విష్ఠి రా2.36
ఆ తదుపరి బవ
వర్జ్యం : రా 11.41 – 1.11
దుర్ముహూర్తం : ఉ 9.51 – 10.51 &
మ 2.52 – 3.43
అమృతకాలం : ఉ8.45 – 10.15
రాహుకాలం : మ 1.30 – 3.00
యమగండం/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి : మేషం || చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం : 5.40 || సూర్యాస్తమయం: 6.14

మేషం : ఆదాయ మార్గాలు నిరాశ కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలుఉంటాయ. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి.

వృషభం : కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆప్తుల నుండి ధనలాభం అందుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

మిధునం : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం : ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమన ఒత్తిడి పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి అవుతాయి.

సింహం : అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వ్యాపారాలు మందగిస్తాయి.దైవ చింతన పెరుగుతుంది.

కన్య : కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానానికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

తుల : చేపట్టిన పనులు ముందుకుసాగక నిరాశ కలుగుతుంది ప్రయాణాలలో వాహన అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాటలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారపరంగా నూతన చిక్కులు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

వృశ్చికం : కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు : కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడతాయి. దాయాదుల తో ఆస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్త వహించాలి.

మకరం : చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలను అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కుంభం : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారమున నూతనోత్సాహంతో పనిచేసి లాభం పొందుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నుంచి ఉపశమనం లభిస్తుంది ఉంటుంది.

మీనం : కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. శిరో బాధలు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు. నిరుద్యోగులకు ప్రయత్న లోపం కలుగుతుంది.

Advertisement

Next Story