పైశాచిక ఘటన.. మహిళను రేప్ చేసి, రహస్య భాగంలోకి రాడ్డును దూర్చి

by Anukaran |   ( Updated:2021-09-10 23:47:03.0  )
పైశాచిక ఘటన.. మహిళను రేప్ చేసి, రహస్య భాగంలోకి రాడ్డును దూర్చి
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై అఘాయిత్యాలను మాత్రం ఆపలేకపోతున్నాయి. ఎంతోమంది నేరస్తులకు కఠినచర్యలు విధించినా క్రూర మృగాళ్లలో మాత్రం మార్పు రావడంలేదు. కామ వాంఛతో వారుచేసే అకృత్యాలకు మహిళలు బలైపోతున్నారు. తాజాగా 32 ఏళ్ల మహిళపై లైంగికదాడికి పాల్పడిన దుండగులు అత్యంత పాశవిక చర్యకు పాల్పడిన ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. సకినాక ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు స్థానికులు గుర్తించి శుక్రవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు పక్కన పడివున్న మహిళను ఘట్కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వైద్యులు తెలిపిన విషయాలను విని పోలీసులు అవాక్కయ్యారు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు రహస్య భాగంలోకి రాడ్డును చొప్పించినట్టు గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి అనుమానితులను అరెస్ట్ చేశారు. మహిళ స్పృహలోకి వచ్చాకా అసలేం జరిగిందో తెలియనుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story