- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ న్యూస్.. గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారిని నిజామాబాద్ నగరంలోని అర్సపల్లికి చెందిన బుర్గుల రాహుల్, అసది ఉదయ్, శివలుగా వారిని గుర్తించారు. ఆదివారం నందిపేట మండలం జి జి నడుకుడ గ్రామ శివారులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సాయి కృష్ణ ( పింకు) , సోను, ఆశోక్ లతో పాటు బుర్గుల రాహుల్, అసది ఉదయ్, శివ స్నానానికి దిగారు. లోతు తెలియక నీటిలో మునుగుతున్న యువకులను మెడారం రాజేశ్వర్ అనే రైతు కాపాడాడు. మిగిలిన ముగ్గురు గల్లంతు కాగా.. వారి కోసం గాలింపు చర్యలు చెపట్టారు.
గోదావరి బ్యాక్ వాటర్‌లో ఎండాకాలం పంటలు పండిస్తారు రైతులు. పంటలు పండించడానికి గోదావరిలో బావులు త్రవ్వుకున్నారు. ప్రస్తుతం గోదావరి నిండుగా ప్రవహించి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండిపోవడంతో.. గంగాగడ్డ నడుకుడు ప్రాంతంలో గోదావరి తీరం అందాలను అస్వాదించడానికి చాలామంది వెలుతుంటారు. అదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో అర్సపల్లికి చెందిన ఆరుగురు డిగ్రీ విద్యార్ధులు అక్కడికి వెళ్లి స్నానానికి దిగి గల్లంతు అయ్యారు. చీకటి కావడంతో గల్లంతు అయిన యువకుల మృత దేహాలను వెలికి తియ్యడం కష్టంగా మారింది.ఈ మేరకు నందిపేట్ పోలిస్ లు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.