- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి
by Sumithra |
X
దిశ, పాలేరు: కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… చంద్రుతండా గ్రామంలో బంధువుల కర్మకాండల కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యం సేవించి అపస్మారక స్థితిలో చేరుకున్నారు. వారిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృత్యువాత పడ్డారు.
మృతులు చంద్రుతండా కు చెందిన బోడా మల్సూర్(55), బోడా హరిదాసు(55) , బోడా భద్రు(35 ) అనే వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్జరీ కి తరలించారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామాన్ని ఎక్సైజ్ పోలీసులు సందర్శించి శాంపిల్స్‌ని సేకరిస్తున్నారు.
Advertisement
Next Story