ఫ్లాష్ న్యూస్: ఆ జిల్లాలో మూడు కొత్త మండలాలు

by Anukaran |
new-zones in vikarabad
X

దిశ, ప్రతినిధి రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. వికారాబాద్ జిల్లాలో దూద్యాల మండలం, నారాయణపేట జిల్లాలో గుండుమాల్, కొత్తపల్లె మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే కొత్త మండలాల విషయంలో అభ్యంతరాలు, వినతులు ఇచ్చేందుకు నెలరోజులు అవకాశం కల్పించింది. దుద్యాల్ మండలాన్ని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి ప్రాంతం ప్రజలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. గత కొంతకాలంగా మండల ఏర్పాటు కావాలని ప్రజలు కోరుతున్న విషయం విధితమే.

Advertisement

Next Story

Most Viewed