కిడ్నాప్ కలకలం.. ‘దిశ’ వార్తతో వెలుగులోకి వాస్తవాలు

by Sridhar Babu |
కిడ్నాప్ కలకలం.. ‘దిశ’ వార్తతో వెలుగులోకి వాస్తవాలు
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. స్థానికంగా మెకానిక్ షెడ్‌లో పని చేసే ముగ్గురు యువకులను.. గుర్తు తెలియని దుండగులు ఆదివారం సాయంత్రం కారులో వచ్చి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ముగ్గురు యువకులలో ఒకరికి బేడీలు వేయటంతో వారిని తీసుకు వెళ్లింది పోలీసులే అని అంతా అనుకున్నారు. ముగ్గురు యువకులను తీసుకెళ్లిన దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. వీడియో క్లిపింగ్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ క్లిప్పింగ్స్‌తో సోమవారం ‘దిశ’లో వార్త ఇవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువకులను నల్లగొండ పోలీసులు గంజాయి కేసులో విచారణ నిమిత్తం అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ‘దిశ’ పత్రిక ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అప్పటి వరకు ఆందోళన చెందిన యువకుల తల్లిదండ్రులు కొంత ఉపశమనం పొందారు. వరంగల్​క్రాస్​రోడ్డులో గంజాయి గుప్పుమంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు గట్టి నిఘా పెడితే యువత పెడదోవపట్టే అవకాశం లేకుండా పోతుందని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story