మూడు వాహనాలు ఢీ ముగ్గురు మృతి

by srinivas |
road accident
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద మంగళ వారం ఉదయం చోటు చేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట టిప్పర్ ఆటోను ఢీ కొంది, అనతరం అది కారునితాకింది. ఈ ప్రమాదంలో ఆటోలో 8మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు పనుల కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed