కారు డోర్ లాకై ముగ్గురు చిన్నారులు మృతి

by srinivas |
కారు డోర్ లాకై ముగ్గురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపులపాడు మండలం రేపల్లె గ్రామంలో కారు డోర్ లాకై ఊపిరాడక ముగ్గురు చిన్నారులు చనిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు కారులో కూర్చోగా కొద్దిసేపటికే డోర్లు పడి లాక్ అయ్యాయి. ఇదే సమయంలో చిన్నారులు ఎంత అరిచినా ఎవరికీ వినపడలేదు. దీంతో ముగ్గురు చిన్నారులకు గాలిపీల్చుకోవడం కష్టంగా మారి ఊపిరాడక కారులో ప్రాణాలు వదిలారు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు చిన్నారులను వెతగ్గా కారులో మృతదేహాలను చూసి బోరున విలపించారు. అప్పటివరకు ఇంట్లో సందడి చేస్తూ ఆడుకున్న చిన్నారులు గంట వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story