కారులో మూడు మృతదేహాలు…

by Sumithra |
కారులో మూడు మృతదేహాలు…
X

కాకతీయ కెనాల్‌లో కారు లభ్యమయ్యి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ కారును అధికారులు వెలికితీసారు. కారులో మూడు మృతదేహాలు లభ్యమయినట్టు తెలిపారు. నిన్న సాయంత్రం కారుతో సహా దంపతులు కెనాల్ పడిపోవడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. దీంతో దాదాపు 20రోజుల తర్వాత కారు పైకి తేలింది. కారులో ఉన్న మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయాయని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కూతురు వినయశ్రీ ఉన్నారు. ఎమ్మెల్యే పోలీసులకు చెప్పినా కేసు నమోదు చేయకపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రమాదమా…? కుట్ర కోణమా…? అనే నేపథ్యంలో విచారణ కొనసాగుతొంది.

Advertisement

Next Story