కొవిడ్ కారణంగా.. అనాథలైన పిల్లలకు అండగా వైవీఓ

by Shyam |   ( Updated:2021-08-23 03:05:58.0  )
కొవిడ్ కారణంగా.. అనాథలైన పిల్లలకు అండగా వైవీఓ
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ -19 మహమ్మారి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసింది. ఎంతోమంది జీవనాధారాన్ని దెబ్బతీయగా, మరెంతోమంది పిల్లల్ని అనాథలను చేసింది. ఈ క్రమంలోనే కరోనావల్ల దెబ్బతిన్న కుటుంబాలతో పాటు, అనాథలను ఆదుకునేందుకు ముంబై ఎన్‌జీవో ‘యంగ్ వాలంటీర్స్ ఆర్గనైజేషన్ (YVO)’ ముందుకు వచ్చింది. నెలవారీగా చిన్న విరాళాల ద్వారా (₹ 506 కంటే తక్కువ) గణనీయమైన కార్పస్‌ని సేకరించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశానికి చెందిన వ్యక్తులతో పాటు, కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు సేకరించి, ఆ విరాళాలను విశ్వసనీయ భారతీయ ఎన్‌జీవో‌లకు పంపిణీ చేస్తోంది.

సమాజహితం కోసం తోటి మనుషులకు సాయం చేసేందుకు 2015 సంవత్సరంలో వైవీవో ప్రారంభమవగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు, స్వచ్ఛంద సేవకులను కలిగి ఉంది. కొవిడ్ కు ముందు విద్య, నైపుణ్యం, రైతు అభ్యున్నతి, మహిళా సాధికారత, నీటి సంరక్షణ వంటి అనేక రంగాల్లో ఆయా ప్రజా కార్యక్రమాలకు నిధులు అందించింది. ఇక సెకండ్ వేవ్ కారణంగా ప్రభావితమైన పిల్లులు, కుంటుంబాల గురించి తెలుసుకున్న ఐవీవో పోస్ట్ కొవిడ్ కేర్ నిధుల సేకరణ చేయాలని నిర్ణయించుకుంది.

‘మహమ్మారి వల్ల బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు వర్చువల్ నిధుల సేకరణ చేపట్టాం. ఇందుకోసం ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించుకుని దాతల్లో దీనిపై అవగాహన కల్పించాం. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చడానికి మద్దతు కోసం ర్యాలీ చేశాం. మేం సేకరించిన నిధులు అనాథ పిల్లలు, కొన్ని కుటుంబాలకు అందిస్తున్నాం. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నిధులు సేకరించాం’ అని వైవీవో సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed