- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ హీరో దగ్గరివన్నీ దొంగిలించి అమ్మేస్తా : అనుష్క శర్మ
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ అనుష్క శర్మ, కింగ్ ఖాన్ షారుఖ్ జంటగా చాలా చిత్రాల్లో కనిపించారు. ‘రబ్నే బనాది జోడి, జబ్ తక్ హై జాన్, జబ్ హారీ మెట్ సెజల్, జీరో’ వంటి చిత్రాల్లో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. కాగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌కు చేరుకున్న షారుఖ్ అంటే తనకు చాలా గౌరవమని అనుష్క ఎప్పుడూ చెప్తుంటుంది. గతంలో ఈ స్టార్స్ ఇద్దరూ ‘యారోం కి భారత్’ షోలో పాల్గొనప్పుడు హోస్ట్ సాజిద్ ఖాన్.. షారుఖ్ నుంచి ఏ వస్తువును దొంగిలించాలని అనుకుంటారు? అని అనుష్కను ప్రశ్నించాడు. అయితే అలాంటివి చాలా ఉన్నాయన్న హీరోయిన్.. వాచెస్ కలెక్షన్ అని సమాధానమిచ్చింది. అంతేకాదు వాటిని దొంగిలించి అమ్మేస్తానని చెప్పింది. ఇక షారుఖ్ ఫ్యామిలీతో ఉంటున్న ఇల్లు ‘మన్నత్’ కూడా చాలా ఇష్టమని తెలిపింది. కాగా ఈ ఆన్సర్‌కు స్పందించిన షారుఖ్.. ‘ఇల్లు నువ్వు తీసుకుంటే నేను, నా ఫ్యామిలీ వ్యానిటీ వ్యాన్‌లో ఉండాలా?’ అని జోక్ పేల్చాడు. కెరీర్ విషయానికొస్తే.. బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.