ఆ కారణంతోనే జబర్దస్త్‌లో వద్దన్నారు : చమ్మక్ చంద్ర

by Shyam |
Chammak Chandra
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లి తెరపై గుర్తుండిపోయే నటులల్లో చమ్మక్ చంద్ర ఒకరు. తన స్కిట్లతో కడుపుబ్బా నవ్విస్తూ.. వయసుతో తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంటాడనడంలో సందేహం లేదు. తన కామెడీ ప్రోగ్రాంనే ఇంటి పేరుగా మార్చకున్న ఆయన.. ఫ్యామిలీ డ్రామా హాస్యంతో బుల్లి తెరపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉన్నది. అందుకే ఆయనకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ కొనసాగించారు. అయితే ఆయన అకస్మాత్తుగా జబర్దస్త్ ప్రోగ్రాం వదిలేసి మరో టీవీ చానెల్‌లో నిర్వహించే కామెడీ షోలో ప్రత్యేక్షమయ్యారు. దీనిపై చాలా రకాలుగా పుకార్లు షికార్లు చేసినా.. తాజాగా చమ్మక్ చంద్రనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

Chammak

ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ కామెడీ షో మానేయడానికి గల కారణాలను ఆయన బయట పెట్టారు. గతంలో రెండుసార్లు జబర్దస్త్ మానేసి మళ్లీ వచ్చానని చెప్పిన ఆయన.. ఆ సమయంలోనే సినిమాల్లో చేశానని గుర్తు చేశారు. అప్పుడే ఓ స్కిట్‌లో గట్టిగా అరవడంతో గొంతు ఇన్ ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. దాంతో మూడు నెలల వరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నానని, ఇదే సమయంలో జబర్దస్త్‌లో వేరేవాళ్లతో స్కిట్లు చేయిస్తుండడంతో తనకు మళ్లీ అవకాశం ఇవ్వలేదని చమ్మక్ చంద్ర చెప్పారు. ఇదే సమయంలో మా టీవీలో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం ప్రారంభం కావడంతో అందులో అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమాలతోపాటు కామెడీ స్టార్స్ ప్రోగ్రాం చేస్తున్నట్లు చమ్మక్ చంద్ర ముగించారు.

Advertisement

Next Story