షర్మిల పార్టీ జెండా ఇదే..

by Shyam |
షర్మిల పార్టీ జెండా ఇదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి చెందిన జెండా సిద్ధమైనట్లుగా లోటస్ పాండ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలిరంగుతో కూడిన జెండా వైఎస్ షర్మిల సిద్ధం చేయించినట్లు సమాచారం. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో తన తండ్రి వైఎస్సార్ చిత్రం ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడటం సెంటిమెంట్ గా భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట శుభాలు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. అయితే జెండాలో వైఎస్సార్ పేరు ఉండాలా వద్దా? అనే అంశంపై డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story