ఇండియా vs ఇంగ్లాండ్.. ఆ మ్యాచ్‌లో చిన్న మార్పు

by Shyam |
ఇండియా vs ఇంగ్లాండ్.. ఆ మ్యాచ్‌లో చిన్న మార్పు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళల జట్టుతో ఇంగ్లాండ్ మహిళల జట్టు ఆడనున్న 3వ టీ20 షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకున్నది. జూన్ 2న ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్ ఇండియా ఏకైక టెస్టుతో పాటు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నది. జూన్ 16 నుంచి 20 వరకు టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 27న తొలి వన్డే, 30న రెండో వన్డే, జులై 3న మూడే వన్డే జరుగనున్నది. టీ20 సిరీస్ జులై 9న ప్రారంభం కానున్నది. 9న తొలి టీ20, 11న రెండో టీ20, 14న మూడో టీ20 జరగాల్సి ఉంది. అయితే మూడో టీ20ని 15న కాకుండా 14కి మార్చాలని ఈసీబీ నిర్ణయించింది. బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్ అభ్యర్థన మేరకే టీ20 మ్యాచ్‌ను ఒక రోజు ముందుకు జరిపినట్లు ఈసీబీ ప్రతినిధి తెలిపారు.

Advertisement

Next Story