- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పండ్లతో వీటిని కలిపి తింటున్నారా.. జాగ్రత్త
X
దిశ, వెబ్‌డెస్క్ : ఎప్పుడూ ఏదో ఒకటి తినేవారు వారికి తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కానీ, కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే మనం మన ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకుంటాం. అది ఎలా అనుకుంటున్నారా.. పండ్లు తినేటప్పుడు కొన్ని రకాల ఆహార పదర్థాలతో కలుపుకొని తినడం వలన మనం అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అంటున్నారు నిపుణులు. అందువలన ఎలాంటి ఆహారం తీసుకోవాలి మిక్స్ చేసి తినడం వలన ఏమైన సమస్యలు ఏర్పాడుతాయా అనే విషయాలను తెలుసుకుని తినాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఎలాంటి పండ్లను తినేటప్పుడు ఏ విధమైన ఆహారంతో కలిపి తినకూడదో ఇప్పుడు చూద్దాం.
- చాలా మంది పెరుగును ఇష్టంగా తింటారు. అలా ఇష్టంగా పెరుగు తినేవారు తమకు తెలియకుండానే వేరే ఐటమ్స్‌తో మిక్స్ చేసి తింటారు. అయితే పుల్లగా ఉండే పండ్లు ఎప్పుడూ పెరుగుతో తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా పుల్లగా ఉండే పండ్లతో పెరుగుతీసుకుంటే డైజెషన్ అవ్వదని దాని వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
- అలాగే క్యారెట్ తో పాటు కమలాలు తినకూడదని అంటున్నారు. ఇలా కనుక తింటే తప్పక కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. అందు వలన ఎప్పుడూ క్యారెట్‌తో కమలాలను తినకండి.
- చాలా వరకు బొప్పాయి పండుతో నిమ్మరసం లేదా నిమ్మకాయ కానీ కలిపి తినరు. కానీ, ఎప్పుడైనా బొప్పాయి పండు తినేటప్పుడు నిమ్మరసం కానీ, నిమ్మకాయ కానీ, కలిపి తీసుకోవద్దు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఇలా తింటే ఎనిమియా సమస్యకి ఇది దారితీస్తుందని, హిమోగ్లోబిన్‌లో కూడా సమస్యలు వస్తాయి.
- అరటి పండు, జామకాయ కూడా కలిపి తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు, తలనొప్పి వస్తాయని చెప్తున్నారు.
- అలానే పైనాపిల్‌తో పాటు పాలు తీసుకోకూడదు అని చెప్తున్నారు. పాలలో ఉండే క్యాల్షియం పైనాపిల్ లో ఉండే పోషక పదార్థాలు రెండింటి వల్ల ఇబ్బంది వస్తుందని పాలతో పాటు పైనాపిల్ తీసుకోవద్దని అంటున్నారు.
- అదే విధంగా పనస పండుని పాలతో పాటు తీసుకోకూడదు. ఇలా కనక చేశారు అంటే చర్మ సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
- పుచ్చకాయ మరియు కర్బూజా కూడా కలిపి తీసుకోకూడదు. దీని వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి.
Advertisement
Next Story