మాటలతో మాయచేసిన యువకులు.. షాక్ అయిన యజమాని

by Sumithra |
మాటలతో మాయచేసిన యువకులు.. షాక్ అయిన యజమాని
X

దిశ, కుత్బుల్లాపూర్ : దుకాణ యజమానిని మాటల్లో దింపిన ఇద్దరు యువకులు నగదు కాజేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్టేస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులోని ఓఫ్యాన్సీ దుకాణంలోకి శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు వచ్చారు. దుకాణ యజమానిని అది కావాలి, ఇది కావాలని మాటల్లో దింపారు. రెప్పపాటులో గల్లాలోని రూ.18600ల నగదును కాజేశారు. ఆదివారం బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story