మూడు సార్లు ఆ విధంగా చేసిన అబ్బాయి.. అమ్మాయిగా మార్చిన పోలీసులు

by Shyam |   ( Updated:2021-04-02 03:38:31.0  )
మూడు సార్లు ఆ విధంగా చేసిన అబ్బాయి.. అమ్మాయిగా మార్చిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏ మనిషికైనా కోరికలు ఉండటం సహజం. ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం ఎంతగానో ప్రయత్నిస్తాం. అలా ఓ యువకుడికి ఒక కోరిక కలిగింది. ఏం కోరికా అనుకుంటున్నారా.. ? షాద్ నగర్ కు చెందిన ఓ యువకుడు, యువతిగా మారాలని నిర్ణయించుకున్నాడు. తన కోరిక గురించి తన తల్లిదండ్రులకు చెప్పాడు. దానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు తన కోరికను కాదనడంతో ఇంట్లోంచి పారిపోయి ఎల్బీ నగర్ లో ట్రాన్స్ జెండర్స్ గ్రూప్‌లో చేరారు. తన కొడుకు కనపడక పోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అతన్ని వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి సంఘటనలే రెండు మూడు సార్లు చోటు చేసుకున్నాయి. చివరి సారి గచ్చిబౌలీ స్టేషన్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇలా ఏందుకు చేస్తున్నావు అని ప్రశ్నించగా .. నేను యువతిగా మారాలి అనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో యువతిగా మారాలన్న తన కోరిక తీరకపోతే భవిష్యత్ లో ఇటువంటివి మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకును కూతురుగా మార్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో యువకుడికి సర్జరీ చేసి యువతిగా మార్చారు. అనంతరం పోలీసులు ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ యువతిగా మారిన యువకుడి నుంచి హామీ తీసుకుని పంపారు.

Advertisement

Next Story