- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేధింపులు తాళలేక.. భర్తను నరికేసింది
దిశ, ఏపీబ్యూరో: జీవితాంతం తోడుగా ఉంటాడునుకున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఆ భార్య గొడ్డలితో నరికేసింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గొర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం… గొర్లగుట్టకు చెందిన వడ్డె చిన్న ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్ ఉన్నారు. ఆంజనేయులు పాలీస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలం నుంచి భార్యపై అనుమానం పెంచుకుని తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో నరికేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.